పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం.
::* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,.
తయారీ విధానం:--
గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి.
గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి.
ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప్యం కారణంగా ముఖంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.4. మలబద్దకం తొలగిపోతుంది. శక్తి బాగావస్తుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ క్రియ బాగా జరుగుతుంది.5. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి.
Comments
Post a Comment