Skip to main content

Dwakra women s rs10k scheme plain ap government!

Podhupu women s to get every month 10k planning ap government ..

రాష్ట్రంలో una  ప్రతి కుటుంబానికి నెలకు రూ.10kఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 
డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. 
ప్రతి కుటుంబం నెలకు రూ.10 kసంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి మహిళాసంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10kఆదాయంసమకూర్చడా సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (earnest and young) సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. 
ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతినెలా 19వ తేదిన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
 రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాలలోని మహిళలకు evary month రూ.10kఆదాయం వచ్చే విధంగా చూడాలని ఆయన ‘సెర్ప్’ను నిర్ధేశించారు.
డ్వాక్రా సంఘాలలో అక్షరాస్యత పెంచేందుకు ‘ప్రథం’ అనే సంస్థ, నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ సహకరిస్తాయని చెప్పారు. హస్తకళల వస్తువులను విక్రయించేందుకు ఇ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. Milkఉత్పత్తులు, పశు సంవర్ధక రంగాలలో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా వున్నాయని, ఆయా రంగాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ వున్న టెక్స్‌టైల్ రంగంలో రాణించేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తయారీరంగంలో దూసుకు వెళుతోందని గుర్తుచేస్తూ, ఈ రంగంలో వున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా డ్వాక్రా మహిళలను సన్నద్ధం చేయాలని కోరారు. 
ప్రాంతాల వారీగా పొదుపు మహిళలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సూక్మ ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి ఆదాయం పెంచేందుకు పథకాలు రచించాలని సూచించారు. ఈ మొత్తం ప్రణాళికలకు నిర్థిష్ట కాల పరిమితిని నిర్ధేశించుకోవాలని చెప్పారు. టాటా ట్రస్టు ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలుచేయబోయే కార్యక్రమాలపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
పశు గణ అభివృద్దిలో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బీఏఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చాయని సెర్ప్ సీఈవో పి. కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 47లక్షల మందికి పెన్షన్లు, 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా సదుపాయం కల్పిస్తోందని, దీనికి అనుబంధంగా ప్రతి మహిళకు రూ.10kఆదాయం వచ్చే ప్రణాళికలను అమలు చేయాల్సివుందని చెప్పారు. నాలెడ్జ్ పార్టనర్స్‌గా టాటా ట్రస్టు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఆధ్వర్యంలో, సేవలందించే సంస్థలు, మార్కెట్ సౌకర్యం, స్కిల్ డెవలప్ మెంట్ (APSSDC) వంటి సంస్థలను గుర్తించామని తెలిపారు.
ఈ సమావేశంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, సెర్ప్ ముఖ్యకార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ గుప్తా unaru...

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప...

Amaravati frist barget 2017 -2018.

నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌.... AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు Capital expenditure: రూ.31,087 కోట్లు  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు R&B- రూ. 4,041 కోట్లు నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు శాప్‌- రూ. 195 కోట్లు విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు Skill development - రూ. 398 కోట్లు జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు Heyer education rs.3513 కోట్లు School s విద్యకు రూ. 17,197 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు పెన్షన్లు రూ. 4376 కోట్లు NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు House dept రూ. 1457 కోట్లు పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు Agiriculure Dept- రూ.9,091 కోట్లు రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు  మహి...

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ...